BREAKING
సర్' ప్రక్రియలో ఫారాలు,ధ్రువపత్రాల పరిశీలన ముఖ్యం: నల్గొండ జిల్లా ఓటరు జాబితా ఎన్నికల పరిశీలకురాలు మరియు రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన పామూరులో టీడీపీ క్లీన్‌స్వీప్ 34వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా సీఆర్‌ విశ్వేశ్వరరెడ్డి.. టార్చ్‌లైట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి.. ప్రజాసేవకు ఒక్క అవకాశం ఇవ్వండి!.. సాయి నగర్, అశోక్ నగర్, జీసస్ నగర్, విద్యుత్ నగర్ ప్రజలకు అభ్యర్థి విజ్ఞప్తి.. ఒక ఎంపీటీసీ టీడీపీ కైవసం ఎల్ నినో పై అప్రమత్తంగా ఉండాలి:మున్సిపల్ చైర్ పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ సీతారామపురం ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం చక్రం తిప్పిన పార్టీ అధ్యక్షులు చింతల శీను 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం ఎంపీపీ పువ్వాడి దంపతులకు ఘన సన్మానం "వైకాపా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి - కాకాణి" ప్రజల నమ్మకమే నా బాధ్యత ఏపీ స్థానిక ఎన్నికల్లో పెరిగిన నిఘా: ఒకే రోజు 9 ఎఫ్‌ఐఆర్‌లు, 1,177 కేసుల నమోదు అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు పోటుమెరక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 2 పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్నబ్ తీవ్ర తుఫాన్ దృష్ట్యా తీర ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ఘటనలపై ఎస్ఈసీ విచారణ చేయించాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

ప్రజలు తుఫాన్ పట్లు అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
ప్రజలు తుఫాన్ పట్లు అప్రమత్తంగా ఉండాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంబంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్నందున మండపేట నియోజకవర్గ ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా  ఉండాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తీవ్ర హెచ్చరిక చేశారు. రాబోయే రెండు రోజుల పాటు వాతావరణంలో ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటాయని, భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ధ్రువీకరించిన నేపథ్యంలో ఆయన ప్రజలకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. భారీ ఈదురుగాలులు, వర్షాల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉంది. కావున ప్రజలెవరూ అనవసరంగా బయటకు రాకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి. తుఫాన్ సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున, తాగునీటి కొరత రాకుండా ముందస్తుగానే తగినంత మంచినీటిని నిల్వ చేసుకోవాలి. ఈ రెండు రోజులు పొలాల్లోకి వెళ్లడం ప్రమాదకరం. ఈదురుగాలులు, మెరుపుల ధాటికి ఎలాంటి జరగరాని ప్రమాదాలు జరగకుండా రైతులు, వ్యవసాయ కార్మికులు పొలాల వద్దకు వెళ్లకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి. నియోజకవర్గంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు మండల స్థాయి అధికారులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ సిబ్బంది పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు. లోతట్టు, బలహీనమైన ఇళ్లలో నివాసముంటున్న ప్రజల కోసం నియోజకవర్గ వ్యాప్తంగా ముందస్తుగా పునరావాస కేంద్రాలను సిద్ధం చేయడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అధికారుల సహకారంతో సురక్షితంగా పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అక్కడ ప్రజలకు భోజన వసతి, సురక్షిత తాగునీరు మరియు వైద్య సదుపాయాలు కల్పించేలా అధికారులను ఆదేశించారు. తుఫాన్ వేళ ప్రజలకు ఏ క్షణంలోనైనా తక్షణ సహాయం అందించడానికి నియోజకవర్గంలో మండలం/టౌన్ వారీగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చిన్న అత్యవసర పరిస్థితి ఎదురైనా మండపేట టౌన్: 08855-233002, మండపేట మండలం: 8919752684, రాయవరం మండలం: 9618006344, కపిలేశ్వరపురం మండలం: 08855-225457 ఈ నెంబర్లలో సంప్రదించాలని ఎమ్మెల్యే కోరారు.