జడ్పీటీసీ అభ్యర్థిగా చీపురుపల్లి బరిలో వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ...టీడీపీ తరుపున బీఫాo అందజేత..…
చీపురుపల్లి సూర్య :
స్థానిక సంస్థల ఎన్నికల్లో చీపురుపల్లి జడ్పిటిసి అభ్యర్థిగా వలిరెడ్డి శ్రీనివాస నాయుడును తెలుగు దేశం పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. అభ్యర్థుల ఉత్కంఠకు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తెరదించారు. కూటమి భాగస్వామ్య పార్టీల తరఫున చీపురుపల్లి స్థానం నుండి జడ్పిటిసిగా బరిలో నిలిచేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు. నామినేషన్ల సందర్భంగా పార్టీ తరఫున తనకు అవకాశం కల్పించాలని, జడ్పీ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ద్వారా స్థానిక శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావుకు, తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి అభ్యర్థిస్తూ వలిరెడ్డి శ్రీనివాస నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. చివరికి వలిరెడ్డి అభ్యర్థిత్వానికే కళా వెంకట్రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పార్టీ బీఫాం ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మంగళవారం అందజేశారు. తనకు అవకాశం కల్పించిన పార్టీ అధిష్టానానికి శ్రీనివాస నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు.
రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా