BREAKING
ప్రాణనష్ట నివారణే లక్ష్యం: ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి సర్' ప్రక్రియలో ఫారాలు,ధ్రువపత్రాల పరిశీలన ముఖ్యం: నల్గొండ జిల్లా ఓటరు జాబితా ఎన్నికల పరిశీలకురాలు మరియు రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన పామూరులో టీడీపీ క్లీన్‌స్వీప్ 34వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా సీఆర్‌ విశ్వేశ్వరరెడ్డి.. టార్చ్‌లైట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి.. ప్రజాసేవకు ఒక్క అవకాశం ఇవ్వండి!.. సాయి నగర్, అశోక్ నగర్, జీసస్ నగర్, విద్యుత్ నగర్ ప్రజలకు అభ్యర్థి విజ్ఞప్తి.. ఒక ఎంపీటీసీ టీడీపీ కైవసం ఎల్ నినో పై అప్రమత్తంగా ఉండాలి:మున్సిపల్ చైర్ పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ సీతారామపురం ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం చక్రం తిప్పిన పార్టీ అధ్యక్షులు చింతల శీను 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం ఎంపీపీ పువ్వాడి దంపతులకు ఘన సన్మానం "వైకాపా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి - కాకాణి" ప్రజల నమ్మకమే నా బాధ్యత ఏపీ స్థానిక ఎన్నికల్లో పెరిగిన నిఘా: ఒకే రోజు 9 ఎఫ్‌ఐఆర్‌లు, 1,177 కేసుల నమోదు అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు పోటుమెరక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 2 పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్నబ్ తీవ్ర తుఫాన్ దృష్ట్యా తీర ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి

‘అర్నబ్‌’ తుపానును ఎదుర్కొనేందుకు విధుల్లో 6 వేల మంది విద్యుత్‌ సిబ్బంది తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవి

Select Suryaa Now
‘అర్నబ్‌’ తుపానును ఎదుర్కొనేందుకు విధుల్లో 6 వేల మంది విద్యుత్‌ సిబ్బంది తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవి

అమరావతి: ‘అర్నబ్‌’ తుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిన ప్రాంతాల్లో త్వరితగతిన పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సుమారు 6 వేల మంది అనుభవజ్ఞులైన అధికారులు, సిబ్బందిని సిద్ధం చేసినట్లు తెలిపారు. మంగళవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తుపాను సన్నద్ధత, విద్యుత్‌ సరఫరా పరిస్థితి, అత్యవసర సేవలపై సమీక్షించారు.

సెలవులు రద్దు.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ
తుపాను ప్రభావం లేని ప్రాంతాల్లోని అవసరమైన సిబ్బంది సెలవులను రద్దు చేసి, ప్రభావిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి తెలిపారు. విద్యుత్‌ సంస్థల డైరెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో డైరెక్టర్లు స్వయంగా పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.
తెగిపడిన విద్యుత్‌ తీగలు, కూలిన స్తంభాలు, దెబ్బతిన్న కండక్టర్ల మరమ్మతులతోపాటు సమస్యలు తలెత్తిన 132 కేవీ సబ్‌స్టేషన్ల వద్ద పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. తుపాను తీవ్రత దృష్ట్యా అవసరమైన విద్యుత్‌ సామగ్రిని డివిజనల్‌ కార్యాలయాలు, మండల కేంద్రాల్లో ముందుగానే సిద్ధం చేసినట్లు చెప్పారు.

ఒకేసారి 30 వేల కాల్స్‌ స్వీకరణ
విద్యుత్‌ సరఫరా అంతరాయాలు, తెగిపడిన తీగలు, కూలిన స్తంభాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వెంటనే స్పందించేందుకు 1912 కాల్‌సెంటర్‌ను బలోపేతం చేసినట్లు గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. ఒకేసారి 30 వేల కాల్స్‌ స్వీకరించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విద్యుత్‌కు సంబంధించిన సమస్యలు ఎదురైతే ప్రజలు 1912కు సమాచారం అందించాలని సూచించారు.

ఇతర శాఖలతో సమన్వయం
అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు విద్యుత్‌ శాఖ ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం పెంచింది. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, కలెక్టరేట్‌ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, స్థానిక సచివాలయ సిబ్బందితో నిరంతరం సమాచార మార్పిడి జరిగేలా ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఏ శాఖకు విద్యుత్‌ సమస్యకు సంబంధించిన సమాచారం అందినా వెంటనే ఆ గ్రూపులో పంచుకునేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. దీనివల్ల సంబంధిత ప్రాంతాల్లోని సిబ్బంది త్వరగా స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు.

విద్యుత్‌ తీగలను తాకొద్దు
తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తెగిపడిన విద్యుత్‌ తీగలు, కండక్టర్లను చేతితో తాకవద్దని హెచ్చరించారు. రహదారులపై పడిన విద్యుత్‌ పరికరాల దగ్గరకు వెళ్లడం కూడా ప్రమాదకరమని తెలిపారు. అలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే విద్యుత్‌ శాఖ సిబ్బందికి లేదా 1912 కాల్‌సెంటర్‌కు సమాచారం అందించాలని కోరారు.
ప్రాణనష్టం జరగకుండా, సాధ్యమైనంత మేర ఆస్తి నష్టాన్ని నివారించేలా అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. తుపాను సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.