BREAKING
నరసరావుపేటలో ఉద్రిక్తత.. వైసీపీ మహిళా అభ్యర్థిపై దాడి! మడకశిరలో కూటమి అభ్యర్థులకు భిఫారాల పంపిణీ నమీబియా వివాదాస్పద పెట్రోలియం బిల్లు చైనా మార్కెట్‌పై దక్షిణ ఆఫ్రికా చెర్రీల గురి దక్షిణ కొరియా సరిహద్దును తనిఖీ చేసిన ఉత్తర కొరియా ఆర్మీ చీఫ్ రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* తైవాన్ కార్మిక సంఘంతో మైక్రాన్ కీలక ఒప్పందం పోలీస్ అమరవీరుల త్యాగాలకు ఘన నివాళి..! అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీపీ రష్మి పెరుమాళ్ స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత పటిష్టం చేయాలి.. జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల వికారాబాద్ అభివృద్ధే లక్ష్యం.. ప్రజల సుభిక్షం కోసం అమ్మవారిని వేడుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టిన యువకుడు, కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతికి నిదర్శనం : విద్యావేత్త కృష్ణారెడ్డి ఘనంగా విజయదశమి వేడుకలు రేపల్లె జెడ్పీటీసీ బరిలో బీజేపీ అభ్యర్థి జుజ్జవరపు సురేష్‌ ఆత్మకూరులో పోలీస్ కవాతు

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి ఆశయాల సాధనే లక్ష్యం – కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా

Select Suryaa Now
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి ఆశయాల సాధనే లక్ష్యం – కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్: దేశ భద్రత, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందికి నిరంతర స్ఫూర్తినిస్తాయని, వారి ఆశయాలకు అనుగుణంగా విధులు నిర్వహించడమే వారికి అందించే నిజమైన నివాళి అని తెలిపారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, ఎస్పీ స్నేహ మెహ్రా పర్యవేక్షణలో జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ దీపక్ తివారీకి ఎస్పీ స్వాగతం పలికారు. అనంతరం అమరవీరుల స్మారక పుస్తకాన్ని అధికారులు పరస్పరం అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ…, 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దేశ సరిహద్దుల రక్షణ విధుల్లో ఉన్న పది మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీస్ యూనిఫాం కేవలం అధికారానికి చిహ్నం కాదని, ప్రజల ప్రాణాలను కాపాడటం, చట్టాన్ని గౌరవించడం, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం, ప్రమాదాలను ఎదుర్కొంటూ ప్రజలకు భద్రత కల్పించడం వంటి బాధ్యతలకు ప్రతీక అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం, సమాజం అండగా నిలవాలని, వారి త్యాగాలను ఎప్పటికీ మరచిపోకూడదని అన్నారు.జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ…, దేశ భద్రత, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యత అని తెలిపారు. అమరవీరుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సానుభూతితో విని, చట్ట పరిధిలో న్యాయం అందించేందుకు కృషి చేయాలని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొంటూ, వారు ఆశించిన సురక్షితమైన, ప్రశాంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం అదనపు ఎస్పీ (అడ్మిన్) రాజేశ్ మీనా 2025 సెప్టెంబర్ 1 నుంచి 2026 ఆగస్టు 31 వరకు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ, అదనపు ఎస్పీతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.

వ్యాసరచన పోటీల్లో విజేతలకు అభినందనలు

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలను ప్రకటించారు. ఎస్‌ఐలు, అంతకంటే పైస్థాయి అధికారులు (సివిల్, ఏఆర్) విభాగంలో కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన డబ్ల్యూఎస్‌ఐపీ మీనాక్షి మొదటి స్థానం, పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐపీ ఎం. ప్రశాంత్ వర్ధన్ రెండో స్థానం, పరిగి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐపీ బి. మోహన కృష్ణ మూడో స్థానం సాధించారు.కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్‌ఐల స్థాయి వరకు (సివిల్, ఏఆర్) విభాగంలో చెంగోముల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన డబ్ల్యూపీసీ జె. ప్రత్యూష (10332) మొదటి స్థానం, కరన్‌కోట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పీసీ బి. సంతోష్ (10633) రెండో స్థానం, మార్పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన డబ్ల్యూపీసీ సీహెచ్. దీపిక (11138) మూడో స్థానం సాధించారు. విజేతలను అధికారులు అభినందించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేశ్ మీనా, డీసీఆర్‌బీ డీఎస్పీ జనయ్య, డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, తాండూరు డీఎస్పీ యాదయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ వీరేశ్‌తో పాటు సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.