ఆత్మకూరులో పోలీస్ కవాతు
ఆత్మకూరులో పోలీసుల కవాతు..
నామినేషన్ల ఉపసంహరణ నేపథ్యంలో ముందస్తు బందోబస్తు
ఆత్మకూర్, మేజర్ న్యూస్ : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆత్మకూరు ఎస్సై నారాయణరెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు పట్టణంలో కవాతు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజలకు భరోసా కల్పించారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు.