రేపల్లె జెడ్పీటీసీ బరిలో బీజేపీ అభ్యర్థి జుజ్జవరపు సురేష్
బాపట్ల కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు
బాపట్ల, మేజర్ న్యూస్:
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేపల్లె నియోజకవర్గం నగరం మండలానికి చెందిన జుజ్జవరపు సురేష్ జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. బీజేపీ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పార్టీ నిర్ణయంతో ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ సమర్పించినట్లు తెలిసింది.