BREAKING
డబ్బాకుపల్లి, పెంటేలవారిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా కొంగర అన్నపూర్ణమ్మ నామినేషన్ కీర్తి సురేష్, రాధికా ఆప్టేల మైండ్ బ్లాకింగ్ పవర్ గేమ్‌.. 'అక్క' క్రైమ్ డ్రామా ట్రైలర్ రిలీజ్! మేయర్ ఎన్నికల బరి నుంచి మాతంగి కృష్ణ ఉపసంహరణ ఎల్ నినో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం.. రైతులు ఆందోళన చెందవద్దు!, మహాదేవపూర్ రైతు వేదిక నుంచి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా, ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కుప్పంలో తెదేపా నాలుగవ వార్డు అభ్యర్థి ప్రచారం 28వ డివిజన్‌లో కూటమి ఆత్మీయ సమావేశం అయ్యప్ప స్వామి నూతన ఉత్సవ విగ్రహ నిర్మాణం పోత బడిలో పిల్లల కష్టాలు - వర్షంలోనే చదువులు బిజెపి కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం.... కూటమి అభ్యర్థులకు అండగా పుర ప్రజలు: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ప్రచార కార్యక్రమంలో అడుగడుగునా వైసిపికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు... భూముల త్యాగం.. అభివృద్ధికి దూరం!, నగరంపల్లి రైతులకు దక్కని ఆశించిన ప్రయోజనాలు, ఓసి -3 తో మారని గ్రామీణ జీవనం పండుగ సాయన్నకు ఘనంగా నివాళులర్పించిన శ్రీనివాస్ రెడ్డి పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు వెల్లటూరు ఎంపీటీసీ సభ్యులుగా ఇరువురు నామినేషన్

గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతికి నిదర్శనం : విద్యావేత్త కృష్ణారెడ్డి

Select Suryaa Now
గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతికి నిదర్శనం : విద్యావేత్త కృష్ణారెడ్డి


మదనపల్లె,మేజర్ న్యూస్ : పట్టణంలోని శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాల అధినేత కృష్ణారెడ్డి తన గురువు స్వర్గీయ రంగనాథ గుప్తా జ్ఞాపకార్థం చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని చిన్నారులకు,ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నవితరణ నిర్వహించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా సంస్థ జనరల్ సెక్రటరీ ఏ.కవితా రాణి మాట్లాడుతూ తమ కుటుంబంలోని శుభకార్యాలను సంస్థ చిన్నారుల మధ్య జరుపుకుంటూ,సంస్థ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న కృష్ణారెడ్డి,వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు,అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.అనంతరం కృష్ణారెడ్డి తన గురువు రంగనాథ గుప్తాని స్మరించుకుంటూ,చిన్నారులకు స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించారు.గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతికి నిదర్శనమని,గురువుల సలహాలను పాటించాలని సూచించారు.ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకొని,సంస్థ అందించే సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని,భవిష్యత్తులో తమలాగే సేవా సంస్థల్లోని నిరుపేద పిల్లలకు అండగా నిలిచి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.గురువులను స్మరించుకుంటూ,సేవాభావాన్ని చాటుతూ చిన్నారులకు స్ఫూర్తినిచ్చిన కృష్ణారెడ్డి సేవలు అభినందనీయమన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి