డబ్బాకుపల్లి, పెంటేలవారిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా కొంగర అన్నపూర్ణమ్మ నామినేషన్
వత్సవాయి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వత్సవాయి మండలంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో డబ్బాకుపల్లి, పెంటేలవారిగూడెం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొంగర అన్నపూర్ణమ్మ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.వత్సవాయి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు–2026కు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి (RO/ARO) శ్రీమతి సీహెచ్. తిరుమలదేవికి ఆమె తన నామినేషన్ పత్రాలను అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో మండలంలో ఎన్నికల సందడి నెలకొంది.