మేయర్ ఎన్నికల బరి నుంచి మాతంగి కృష్ణ ఉపసంహరణ
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు నగర మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ విషయమై ఆయనను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పిలిపించి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర చర్చించి సముదాయించినట్లు సమాచారం. ఈ సందర్భంగా మాతంగి కృష్ణకు నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని బీదా రవిచంద్ర హామీ ఇచ్చారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి కూడా ఆయనకు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. పార్టీ నాయకులతో చర్చల అనంతరం మాతంగి కృష్ణ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో మేయర్ ఎన్నికల పోటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.