BREAKING
ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం శ్రీహరిపురంలో పల్లె నిద్ర కార్యక్రమం నవంబర్ 14 నుండి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం చేయండి గ్రంథాలయ వారోత్సవాలకు అధికారులకు ఆహ్వానం మండల పరిషత్ పీఠంపై"మరడాన"ముద్ర.. సంక్రాంతి బరిలో సందడికి సిద్ధం.. రెండు నెలల ముందే ప్రమోషన్స్ షురూ చేసిన అనిల్ రావిపూడి ఆటపాటలతో కూడిన బోధనపై అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ...ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనకదుర్గ. పరిషత్ పోరులో కీలక ఘట్టం.. ఎంపీపీ ఎన్నికకు వేళాయే లాయర్‌గా కీర్తి సురేశ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్.. సత్యవాన్ సావిత్రి ట్రైలర్ విడుదల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు మన్యం సవారి లో ఎన్ జి ఓ నాయుకులు గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి ఎంతవరకు మేలు చేస్తుంది? వైద్యులు చెబుతున్న అసలు నిజాలు ఇవే మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతి టీడీపీకి, రాజకీయ రంగానికి తీరని లోటు చేయి తడిపితే చాలు.. చెక్ పోస్టు దాటెయ్యడమే!!!

పొగాకు, మద్యపానం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహనా

Select Suryaa Now
పొగాకు, మద్యపానం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహనా

సూర్య డిచ్ పల్లి :తెలంగాణ విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) యూనిట్ - I యూనిట్ II ఆధ్వర్యంలో కిల్ ది క్యాన్సర్, క్యాన్సర్‌ను జయిద్దాం అనే అంశంపై వక్తృత్వ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు క్యాన్సర్‌పై అవగాహన, ముందస్తు గుర్తింపు, నివారణ చర్యలు, ఆరోగ్యకరమైన జీవనశైలి, పొగాకు, మద్యపానం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ఆసక్తికరంగా ప్రసంగించారు. క్యాన్సర్‌ను భయంతో కాకుండా అవగాహనతో ఎదుర్కోవాలని, సమాజంలో అపోహలను తొలగించాలని విద్యార్థులు పిలుపునిచ్చారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డా. ఎం. అథీక్ సుల్తాన్ ఘోరి, డా. ఎం.బి. బ్రహ్మరాంబికల మార్గదర్శకత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.