పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మృతికి నివాళి..
పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మృతికి నివాళి..
బెజ్జంకి/మేజర్ న్యూస్:
మండల పరిధిలోని రాంసాగర్ గ్రామ సర్పంచ్ ఇంగాల లక్ష్మి భర్త పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంగాల నాగమల్లేశం ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి గురువారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారి కుటుంబలకు అధైర్య పడొద్దని భరోసా కల్పించారు.అనంతరం నాగమల్లేశం చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.పరామర్శలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు లింగాల లక్ష్మణ్,ఏఎంసీ మాజీ చైర్మన్ కచ్చు రాజయ్య,నాయకులు దీటి రాజు,ఘనపురం తిరుపతి,రామారావు,సంజీవరావు,బుచ్చయ్య,రవి తదితరులు ఉన్నారు.సూర్య రిపోర్టర్,భాస్కర్(బెజ్జంకి)