పెద్దకాపర్తిలో నీటి వృధా అరికట్టేందుకు ముందస్తు చర్యలు.. చెరువు కాలువల మరమ్మతులు
చిట్యాల- మేజర్ న్యూస్
చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద వి.బి. రాంజీ ఆధ్వర్యంలో కీలక అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామంలోని పెద్ద చెరువు అలుగు నుండి నీరు వృధాగా పోకుండా, కింద ఉన్న గొలుసుకట్టు చెరువులకు సాగునీరు సజావుగా వెళ్లేలా కాలువలకు గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం ప్రత్యేక శ్రద్ధతో మరమ్మతులు చేయిస్తున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కాటం వెంకటేశం మాట్లాడుతూ.. ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులరీత్యా, ముందస్తు జాగ్రత్తగా వ్యవసాయ, జల వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫాంపాండ్స్, ఇంకుడు గుంతలు మరియు గొలుసుకట్టు కాలువల ద్వారా ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టి, నీరు వృధా కాకుండా అరికట్టుకోవచ్చని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మర్రి హరీష్ రెడ్డి, పంచాయతీ సెక్రెటరీ కృష్ణయ్య, గంటల పుల్లారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ చేకూరి మల్లేష్, కారోబార్‌తో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.