పరకాల శివాలయాన్ని దర్శించుకున్న రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న
పరకాల, మేజర్ న్యూస్, పరకాల పట్టణంలోని పురాతన శివాలయాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న దర్శించుకున్నారు. వారి వెంట పరకాల మండల ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో శివయ్యకు ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, పరకాల ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సంఘం నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్; పురుషోత్తం. బి, పరకాల హనుమకొండ జిల్లా