పదో తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి - ఎంఈఓ ప్రవీణ్ కుమార్
సూర్య పెద్ద కొడపగల్: పెద్దకోడప్గల్ మండలంలోని వడ్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు మండల విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, మెరుగైన బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రత్యేక తరగతుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉన్నతాధికారులకు నివేదించాల్సి వస్తుందని హెచ్చరించారు.అనంతరం వడ్లం ఉన్నత పాఠశాలలో నిర్మాణంలో ఉన్న మూత్రశాలల పనులను పరిశీలించారు. పనులు కొంతమేర మిగిలి ఉన్నందున కాంట్రాక్టర్‌తో మాట్లాడి వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి పాఠశాల యాజమాన్యానికి అప్పగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ , పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.