పాఠశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
సూర్య సోన్/భైంసా : నిర్మల్ జిల్లా సోన్ మండలం సిద్దులకుంట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో విద్యార్థులు ఉపాధ్యాయులు జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.ముందుగా మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయులు బానాల నరెందర్ తో పాటు విద్యార్థినులు మిన్ను, మనోజ్ఞ విద్యాదినోత్సవ ప్రాముఖ్యతను సవివరంగా తెలియ జేశారు.కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు భూమా రెడ్డి, ఉపాధ్యాయులు కడారి దశరథ్,బద్దం సాయిరెడ్డి,ముర్థూజా ఖాన్,నరేందర్,సౌజన్య,స్కావెంజర్ మల్లేశ్,విద్యార్థులు పాల్గొన్నారు.