నేరాల అదుపునకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో ముఖ్యం - ఎస్సై అనిల్
సూర్య- బిక్కనూర్ : నేరాల అదుపునకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో ముఖ్యమని, ఎస్సై అనిల్ చెప్పారు. బుధవారం మండలంలోని బాగిర్తిపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన పది సీసీ కెమెరాలను ఆయన సర్పంచ్ గంగయ్యగారి నరసింహులుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో గ్రామ ప్రజల భద్రత, నేరాల నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గ్రామంలోని ముఖ్యమైన ప్రదేశాలు, ప్రధాన రహదారులు మరియు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను కవర్ చేసే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని. వీటి ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలు, నేరాలను గుర్తించడంతో పాటు, నేరాల దర్యాప్తులో కూడా సీసీ కెమెరాల ఫుటేజ్ కీలకంగా ఉపయోగపడుతుందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సౌజన్య, జేపీవో రవి,ఉపసర్పంచ్ వడ్ల స్వామి.వార్డు సభ్యులు గోండ్ర అశోక్, నీల మల్లేశం, మామిడి మహేందర్.నాయకులు చాకలి రమేష్, ప్రభు స్వామి, మామిడి నరేష్ తదితరులు పాల్గొన్నారు