నవంబర్ 3న సిరిసిల్లలో భారీ సాంస్కృతిక కార్యక్రమం-100 మంది జానపద కళాకారుల ప్రదర్శన
సూర్య రాజన్న సిరిసిల్ల జానపద కళాకారులను ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక రాయితీలు,ఆర్థిక సహకారం అందించాలని తెలంగాణ ఫోక్ అసోసియేషన్ నిర్వాహకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీస్ కన్వీనర్ ఎండి సత్తార్ గాయకుడు మాట్ల తిరుపతి లు మాట్లాడుతూ జానపద కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు,24 క్రాఫ్ట్స్ కళాకారులను ఒకే వేదికపైకి తేవాలనే లక్ష్యంతో సిరిసిల్ల వేదికగా తెలంగాణ ఫోక్ అసోసియేషన్, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భవిస్తున్నట్లు తెలిపారు.సినిమా పరిశ్రమకు ఇస్తున్నట్లే జానపద కళాకారులకు రాయితీలు ఇవ్వాలని,ప్రస్తుతం సొంత డబ్బుతో పాటలు,మినీ సినిమాలు తీసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఇందులో భాగంగా నవంబర్ 3న మంగళవారం సాయంత్రం 6 గంటలకు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని,రాష్ట్రవ్యా