మండాలపాడులో నూతన చేయూత పింఛన్ల పంపిణీ
ఆర్థిక భరోసా లక్ష్యంగా ప్రజా పాలన
పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....
(కిరణ్ కుమార్ ఆరిక )
పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామంలో
అర్హులైన పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చేయూత పింఛన్లను మంజూరు చేస్తోందని మండాలపాడు గ్రామ సర్పంచ్ గాయం రమేష్ అన్నారు.
మండాలపాడు గ్రామ పంచాయతీకి ఈ విడతలో మంజూరైన 36 నూతన చేయూత పింఛన్ల లబ్ధిదారులకు జిల్లా దిశ కమిటీ సభ్యులు పోతురాజు కిషోర్‌తో కలిసి మంజూరు ఉత్తర్వులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గాయం రమేష్ మాట్లాడుతూ.. చేయూత పింఛన్లు నిరుపేద కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఆర్థిక అండగా నిలుస్తాయని తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
అలాగే వృద్ధులకు త్వరలో పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తెలిపారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్రి రామారావు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.