BREAKING
మండాలపాడులో నూతన చేయూత పింఛన్ల పంపిణీ మిషన్ భగీరథ నీరు వృథా.. పట్టించుకోని అధికారులు! హెచ్ఎండీఏ నిధులపై ఎమ్మెల్యే యాదయ్య, సర్పంచ్ కొండల్ యాదవ్ మధ్య వాగ్వాదం మార్లమడికి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డిఓ.. పల్లెల ప్రగతికి రూ.5 కోట్ల చేయూత నాలుగు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు బొమ్మన మధుమోహన్‌రెడ్డి కృషి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు విద్యార్థుల ఉన్నతికి చేయూత విద్యాభివృద్ధికి అవోపా దంపతుల బాసట తాండూరులో కారు బీభత్సం.. 12 బైకులు ధ్వంసం కట్టంగూర్ పంచాయితీ.. నిధులున్నా కొరవడిన గతులు!* అభివృద్ధికి అడ్డుపడుతున్న ఆధిపత్య పోరు!*నాడు ఉపసర్పంచ్‌కు అవమానం.. నేడు సర్పంచ్‌కు పరాభవం మార్లమడికి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో నగరపాలక సంస్థ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి జనగణన ఫేజ్‌2 విధివిధానాలపై రెండో రోజు శిక్షణ హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు ఘన వ్యర్థాల నిర్వహణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు

పల్లెల ప్రగతికి రూ.5 కోట్ల చేయూత నాలుగు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు బొమ్మన మధుమోహన్‌రెడ్డి కృషి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

Select Suryaa Now
పల్లెల ప్రగతికి రూ.5 కోట్ల చేయూత నాలుగు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు బొమ్మన మధుమోహన్‌రెడ్డి కృషి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

కర్నూలు, మేజర్ న్యూస్: పదవి, అధికారం లేకపోయినా సొంత నిధులతో పల్లెల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు బొమ్మన మధుమోహన్‌రెడ్డి. తాను సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సమాజ సేవకు కేటాయిస్తూ స్వగ్రామం ఉప్పలపాడుతో పాటు ఉయ్యాలవాడ, ఎన్.కొంతలపాడు, బుక్కాపురం గ్రామాల ప్రగతికి సుమారు రూ.5 కోట్లు వెచ్చించారు.

ఆలయాలు, తాగునీటి వసతికి పెద్దపీట

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. ఉప్పలపాడులో కర్రెమ్మ, మారెమ్మ, సుంకులమ్మ ఆలయాల నిర్మాణానికి రూ.7 లక్షలు, దర్గా నిర్మాణానికి రూ.6 లక్షలు అందించారు. ఉయ్యాలవాడలో రూ.6 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. కొండపై వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బోరు, మోటారు సమకూర్చారు. వాల్మీకి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ, అభివృద్ధి పనులకు రూ.5 లక్షలతో భూమిపూజ చేశారు.

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. యువతకు ఉపాధి

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత చదువులు పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు మధుమోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారు. విప్రో, ఇన్ఫోసిస్, ట్యాబ్, జెమిని తదితర సంస్థల్లో యువతకు ఉద్యోగాలు లభించేలా తోడ్పాటునందించారు. పేద కుటుంబాలకు చెందిన ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు.

రైతులు, పేదలకు అండగా..

రైతులు పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడకుండా వ్యవసాయ రహదారుల నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ఎన్.కొంతలపాడులో రూ.10 లక్షలతో గోశాల భవనాల నిర్మాణ పనులు ప్రారంభించారు. పేద కుటుంబాల్లో వివాహాలకు ఆర్థిక సాయంతో పాటు, వివిధ గ్రామాల్లో పండుగలు, ఉత్సవాల నిర్వహణకు రూ.1.50 లక్షలు ఖర్చు చేశారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ పేదలకు అన్నదానం, ఆర్థిక సాయం అందించారు.

ప్రజాసేవలోనే సంతృప్తి..

ఎంసీఏ, ఎల్‌ఎల్‌బీ చదివిన బొమ్మన మధుమోహన్‌రెడ్డి ప్రస్తుతం అలగనూరు రిజర్వాయర్‌లో గుత్తేదారుగా పనిచేస్తున్నారు. ‘‘నాకు ఉన్నదాంట్లో పది మందికి సాయం చేయాలన్నదే నా ఆశయం. స్వగ్రామంతో పాటు చుట్టుపక్కల పల్లెల్లో తాగునీరు, రహదారులు తదితర మౌలిక వసతులు మెరుగుపడాలి. యువతకు ఉపాధి, పేదల కళ్లల్లో ఆనందం చూడటమే నాకు నిజమైన సంతృప్తి. భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా’’ అని మధుమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.