BREAKING
జస్టిస్ సామ్ కోషికి ఢిల్లీ పగ్గాలు.. కొలీజియం కీలక నిర్ణయం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి.. ముండ్లమూరు జడ్.పి.టి. సి టిడిపి అభ్యర్థిగా మందలపు సౌమ్య. సరిహద్దుల్లో మా గస్తీ సాధారణమే.. శాంతి కోసం భారత్‌ కలిసి పనిచేయాలి: భారత్ ఆరోపణలను తోసిపుచ్చుతూ చైనా ప్రకటన! శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు.... విద్యుత్ షాక్‌తో 17 ఏళ్ల యువకుడు మృతి.. పర్దీపురం గ్రామంలో తీవ్ర విషాదం* మూడు మండలాల్లో కూటమిదే ఆధిక్యం.. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధీమా నేల ఆరోగ్య పరిరక్షణకు ‘ఖేత్ బచావో అభియాన్’ అబుదాబి ఎయిర్ పోర్టులో ఎలికట్టవాసి రజియా మృతి మన నగరం.. మన మనిషి.. మన మేయర్‌ అభ్యర్థి! జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శ్రీ పైడితల్లమ్మకు సారె సమర్పణ.. అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలి ....హోంమంత్రి అనిత యూఎన్‌ఎస్‌సీలో అందరికీ వీటో ఉండాల్సిందే: భారత్ డిమాండ్ ఏపీ స్థానిక ఎన్నికలపై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ.. జడ్పీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని

మణుగూరు కండక్టర్ ప్రవళిక కు పరామర్శ - ఆమె ఆరోగ్యం పై హనుమంతు ముదిరాజ్ ఆరా

Select Suryaa Now
మణుగూరు కండక్టర్ ప్రవళిక కు పరామర్శ  - ఆమె ఆరోగ్యం పై  హనుమంతు ముదిరాజ్ ఆరా

                                  సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్

తెలంగాణ బ్యూరో , ప్రతినిధి : సాయి సంజీవిని ఆస్పత్రిలో చికిత్చ పొందుతున్న మణుగూరు ఆర్ టి సీ  డిపో కండక్టర్ ప్రవళికను టి జెఎమ్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, డి ఎస్ ఎన్ ఆర్ డిపో కార్యదర్శి బి.ఎన్. రెడ్డి, హైదరాబాదు సిటీ రిజినల్ ప్రెసిడెంట్ రాజయ్య, హెచ్ వైటి డిపో సెక్రటరీ కె.ఆర్.ఎమ్. రావ్ తదితరులు పరామర్శించారు. అదే విధంగా ప్రవళిక తల్లి  విజయ లక్ష్మి ని ,ఆస్పత్రికి వచ్చిన ఈ డి వెంకన్న ని, ఈ డి సోలోమన్ ని ఖమ్మం ఆర్. ఎం. సాయిరామ్ ని, ఆర్. ఎం. శ్రీనాథ్ ని కలిసి ఆరోగ్యపరిస్తితి గురించి అడిగి  తెలుసుకున్నారు.  ఆధార్ కార్డు లేకపోవడంతో టికెట్ తీసుకోవాలని సూచించిన కండక్టర్ ప్రవళ్లికను ప్రయాణికురాలు తోసివేయడంతో ఆమె కిందపడి ప్రమాదానికి గురైన ఘటన తెలిసిందే . అనంతరం ఆస్పత్రి సూరింటెండెంట్ ని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కండక్టర్ ప్రవళిక ఆరోగ్యం క్లిష్టంగా ఉందని వైద్యులు తెలిపారు. యాజమాన్యం వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని టి జెఎమ్‌యురాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ కోరారు.