BREAKING
అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా జగన్మాతను దర్శించుకున్న సుప్రీం జస్టిస్ భట్టి పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు

మహిళా విద్యకు మార్గదర్శకుడు మహాత్మా ఫూలే -నీలం మధు ముదిరాజ్

Select Suryaa Now
మహిళా విద్యకు మార్గదర్శకుడు మహాత్మా ఫూలే -నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు;మహిళా విద్యకు మార్గదర్శకుడిగా,సామాజిక సమానత్వ సాధనకు కృషి చేసిన మహనీయుడిగా మహాత్మా జ్యోతిరావు ఫూలే దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఫూలే అని కొనియాడారు.శనివారం జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్‌లో ఉన్న తన నివాసంలో ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నీలం మధు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు విద్య అందించడమే సమాజ అభ్యున్నతికి ప్రధాన మార్గమని నమ్మిన ఫూలే,తన సతీమణి సావిత్రిబాయి ఫూలేతో కలిసి బాలికల విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు.అణగారిన వర్గాలకు విద్య, సామాజిక గౌరవం, సమాన హక్కులు కల్పించేందుకు ఫూలే దంపతులు చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. సత్యశోధక్ సమాజ్ స్థాపన ద్వారా కులవివక్ష, అంటరానితనం,సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలన్న ఫూలే ఆశయాలు నేటికీ ఎంతో ప్రాసంగికమని అన్నారు.మహాత్మా ఫూలే చూపిన మార్గంలో నడుస్తూ విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు.