BREAKING
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో వైస్ చైర్మన్ గా వెంకట కార్తీక్. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ గా బుట్నా లక్ష్మి, ప్రమాణ స్వీకారం. ఏపీలో బియ్యం ధరలకు కళ్ళెం! తొలి టీడీపీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన హనీస్పందన ఇండోనేషియా ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక చైర్మన్‌గా నల్లా శ్రీధర్ ప్రమాణ స్వీకారం.... బ్రెజిల్ ఫెర్రోనికెల్ డీల్‌పై ఐరోపా ఉక్కు సంస్థల డిమాండ్ ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకులు నేడు ఎస్పీ, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చలు.. అఖిలేష్, రాహుల్ చేతిలో తుది నిర్ణయం బ్లాక్‌స్టోన్ నుంచి పీజీపీ గ్లాస్ కొనుగోలుకు బ్రూక్‌ఫీల్డ్ ఒప్పందం పొన్నూరు 38వ వార్డు లో జోరందుకున్న వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సల్మాన్ ఎన్నికల ప్రచారం సేవల రంగం నెమ్మదించినా తయారీ డిమాండ్‌తో భారత్ ఆర్థిక జోరు ఐరోపాలో క్లౌడ్ సార్వభౌమత్వం దిశగా అడుగులు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లకు పాల్పడొద్దు.. వృద్ధుల సంరక్షణ, శిశు సంరక్షణకు 2030 లక్ష్యాలు

మద్దికుంటలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు - ఆకట్టుకుంటున్న విద్యుద్దీపాల అలంకరణ

Select Suryaa Now
మద్దికుంటలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు - ఆకట్టుకుంటున్న విద్యుద్దీపాల అలంకరణ

సూర్య -మానకొండూర్, మండలంలోని మద్దికుంట గ్రామంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా సాగుతున్నాయి. ఆదిశక్తి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో ఐదో రోజు శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భవాని మాలాధారులు, భక్తులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఐదవ రోజున అమ్మవారు భక్తులకు ముల్లోకాలను పాలించే సకల సౌభాగ్య ప్రదాయిని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు. భండాసుర సంహారం కోసం అవతరించిన లలితా దేవిని దసరా నవరాత్రులలో ఐదో రోజున పూజించి, లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల సకల ఐశ్వర్యాలు, సుఖశాంతులు సిద్ధిస్తాయని అర్చకులు తెలిపారు.ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు దుర్గామాత మండపాన్ని అత్యంత సుందరంగా, భక్తులను ఇట్టే ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుద్దీపాల జిలుగు వెలుగుల నడుమ, చక్కటి ఉత్సాహం, ఉల్లాసం కలిగించేలా ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో ఈ వెలుగుల కాంతులు భక్తులకు కన్నులపండువగా నిలుస్తున్నాయి. మద్దికుంట పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.ఈ పూజా కార్యక్రమాలలో గ్రామ సర్పంచ్ బుర్ర శ్రీధర్ గౌడ్, భవాని మాలాధారులు బొంగోని శ్రీనివాస్ గౌడ్, కత్తి ప్రభాకర్ గౌడ్, బుర్ర శ్రీకాంత్ గౌడ్, బుర్ర ఆంజనేయులు గౌడ్, కత్తి రాకేష్ గౌడ్, బుర్ర అభిలాష్ గౌడ్, మాచ మల్ల సాయి, బొమ్మ వినయ్ గౌడ్, బుర్ర అచ్యుత్ గౌడ్, చిల్లా అరుణ్,  కెక్కర్ల గంగరాజు గౌడ్, ఎలుకపల్లి అన్వేష్, గొర్రె అభినయ్, కత్తి సాత్విక్, బొంగోని చాణిక్య గౌడ్, ఆదిశక్తి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.