మద్దికుంటలో నీటి సంరక్షణే ధ్యేయంగా 'జలసరి' కార్యక్రమం
సూర్య - మానకొండూర్: మండలంలోని మద్దికుంట గ్రామంలో గ్రామ సర్పంచ్ బుర్ర శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో జలసరి కార్యక్రమం నిర్వహించారు. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎంపీడీవో వెంకట వరలక్ష్మి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం, బోర్ వేల్ రీచార్జ్ పిట్, అలాగే కమ్యూనిటీ సోక్ పిట్ ల నిర్మాణానికి అవసరమైన ప్రాంతాలను గుర్తించి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో వరలక్ష్మి మాట్లాడుతూ.. మండల ప్రజలు నీటిని వృథా చేయవద్దని, ప్రతి ఒక్కరూ నీటిని ఎంతో పొదుపుగా వాడాలని సూచించారు. భూగర్భ జలాలు పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిల్ల శ్రీధర్, టీపీ శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి కవిత, ఫీల్డ్ అసిస్టెంట్, జీపీ సిబ్బందితో పాటు స్థానిక గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.