రాప్తాడు ఉన్నత పాఠశాలలో కలకలం పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి.. గొంతు కోసిన దుండగుడు
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం కలకలం చోటుచేసుకుంది. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ ఉన్మాది చెక్క మొద్దులు కోసే మిషన్‌తో దాడికి పాల్పడినట్లు సమాచారం.
ఈ ఘటనలో గోపిక లక్ష్మి అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దాడి ఘటనతో పాఠశాల ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి.
విద్యార్థినిపై దాడికి గల కారణాలు, నిందితుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్