కొత్తూరు వన్ లో జోరందుకొన్న జనసేన.
కొత్తూరు, సూర్య: మండల కేంద్రమైన కొత్తూరు వన్ యంపిటిసి స్థానంలో జనసేన జోరందుకొంది.జనసేన అభ్యర్థిగా పోటీచేస్తున్న లోతుగెడ్డ జయలక్ష్మి ప్రచారం లో ముందంజ లో ఉంది. జయలక్ష్మి ఇంటింటి ప్రచారంలో
ప్రజలు అభిమానం చూరగొంటుంది.కొత్తూరు వన్ లో కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన ,తెలుగుదేశం మధ్య ప్రధాన పోటీ నెలకొన్న జనసేన ముందుందని పరిశీలకులు భావిస్తున్నారు. 2014 లో జయలక్ష్మి యంపిటిసి గా ఎన్నికైంది.యంపిటిసి గా అనుభవం ఉన్న జయలక్ష్మి ,ఆమె భర్త జనార్ధనరావు,జనసేన నేతలు,అభిమానులు,కార్యకర్తలు తో కలసి తమదైనా శైలి లో ఓటర్లు ను కలుస్తూ తమకు ఈ సారిఅవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కొత్తూరు పుర వీధుల్లో విస్తృతంగా చేస్తున్న ప్రచారం పలువుర్ని ఆక ట్టుకొంటుంది. జనసేన అభ్యర్థి భర్త జనార్ధనరావు ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసే అనుభవం ఉన్నందున మహిళలకు స్వయంగా కలసి జయలక్ష్మి ని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కొత్తూరు వన్ లో త్రిముఖ పోటీ జరుగుతున్నా పోటీ మాత్రం జనసేన తెలుగుదేశం మధ్య నెలకొంది.ఈసారి తనకు యంపిటిసి గా అవకాశం ఇవ్వాలని,కోరుతూ ప్రజల మద్దత్తు కోసం భార్య భర్తలు ముందుకు సాగుతున్నారు.