BREAKING
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత! పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ బహుకరణ *మధిరలో భారత తొలి మహిళ ప్రధాని ఇందిరా గాంధీకి ఘననివాళ్లి* మధిర, సూర్య మేజర్ న్యూస్. జాతీయ సమగ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు చిన్నారులతో శ్రీరామ్ చినబాబు సందడి అట్టహాసంగా ప్రారంభమైన జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ వాలీబాల్‌ ఎంపిక పోటీలు తారకరామానగర్‌లో వైసీపీ ఎన్నికల ప్రచారలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. టిడిపి అఫ్రోజ్ కు జన్మదిన తెలిపిన డాక్టర్ ఫరీద్ బాబా రేణిగుంటలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విస్తృత ప్రచారం రాప్తాడులో విద్యార్ధినిపై అమానుషదాడిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన ఉన్మాదిపై కఠిన చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశాలు గ్లామర్ ప్రపంచంలో నితాన్షి గోయెల్ కొత్త ప్రయాణం 'షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా' జ్ఞాపకాలను పంచుకున్న తుషార్ కపూర్, సంజయ్ గుప్తా! కోతుల దాడులతో విసిగిపోయిన గ్రామస్తులు.. స్వచ్ఛందంగా నిధుల సేకరణ 'రామాయణం పార్ట్ 1' అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ కుందుర్పి లో ప్రచారం లో దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ.

ఇందిరా గాంధీ సేవలు, త్యాగాలు దేశ చరిత్రలో చిరస్మరణీయం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR)

Select Suryaa Now
ఇందిరా గాంధీ సేవలు, త్యాగాలు దేశ చరిత్రలో చిరస్మరణీయం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR)

ఇందిరా గాంధీ సేవలు, త్యాగాలు దేశ చరిత్రలో చిరస్మరణీయం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR)

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:

భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ 42వ వర్ధంతి వేడుకలను శనివారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తొలుత పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్‌లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) మాట్లాడుతూ...

భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ దేశానికి అందించిన సేవలు, చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. దేశ సమగ్రత, సమైక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు, చూపిన ధైర్యసాహసాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం సాధనకు ఆమె చేసిన కృషి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. ముఖ్యంగా మహిళలు రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఇందిరా గాంధీ నాయకత్వం స్ఫూర్తినిచ్చిందని తెలిపారు.

ఇందిరా గాంధీ ఆశయాలను, ప్రజాసేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే BLR పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.