చిన్నారులతో శ్రీరామ్ చినబాబు సందడి
మదనపల్లె,మేజర్ న్యూస్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా,తెలుగుదేశం పార్టీ (కూటమి) చైర్మన్ అభ్యర్థి జి.శ్రీరామ కుమార్ (చిన్నబాబు)కి ప్రజల నుండి మరియు మరీ ముఖ్యంగా చిన్నారుల నుండి కూడా విశేష స్పందన లభిస్తోంది.అందులో భాగంగా స్థానిక నీరుగట్టువారిపల్లెలో ప్రచారంలో వెళుతుంటే, సాయి విద్యానికేతన్ హైస్కూల్ చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాటలకు చిందేస్తూ,చినబాబుకి తమ మద్దతు తెలపడం ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.చిన్న,పెద్ద తేడా లేకుండా అందరూ ఆయన వైపే నిలుస్తుండటంతో,కూటమి ప్రచారం మరింత వేగం పుంజుకుంది.
మదనపల్లె శ్రీరాముడి కోసం రంగంలోకి రాయచోటి రాముడు
నాడు ఒంటిమిట్టలో విజయభేరి,నిన్న రాయచోటి మున్సిపాలిటీలో క్లీన్ స్వీప్,నేడు మదనపల్లె గడ్డపై శ్రీరామ్ చినబాబు విజయం కోసం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాస్ ఎంట్రీ ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది.ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో
మదనపల్లె రాజకీయాల్లో మరోసారి సత్తా చాటేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్ల నియోజకవర్గం ఇంచార్జి