BREAKING
భారత మహిళా క్రికెట్‌కు అరుదైన ఘనత... యాభై ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసిన బీసీసీఐ! పంజాబ్ ఎన్నికల వేడి: ఆప్ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల.. చరిత్ర సృష్టించిన ఐరిష్ బౌలర్... వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు నమోదు చేసిన జై మూంద్ర! ర్యాపిడో డెలివరీ బాయ్ హస్తలాఘవం: రూ.62 వేల బంగారు నగలతో పరారీ! సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ... యూఏఈ చేతిలో ఘోర ఓటమి! మానకొండూరులో ఘనంగా రేమిడి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయి ఎంపికలు హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో విధ్వంసం... శ్రీలంకపై సంచలన విజయం సాధించిన స్కాట్లాండ్! నియోజకవర్గ స్థాయి మాక్ అసెంబ్లీకి ముగ్గురు విద్యార్థులు ఎంపిక. టెస్టు క్రికెట్‌లో అరుదైన మైలురాయి... వంద వికెట్ల క్లబ్‌లో చేరిన వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్! భారత్ ఏ జట్టు కెప్టెన్ ధ్రువ్ జురెల్ అద్భుత పోరాటం... ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్! న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కీలక మార్పు... భారత జట్టులోకి యువ పేసర్ ఆకిబ్ నబీ ఎంట్రీ! చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్‌గా మహేందర్ నందారి నియామకం టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు... ఆసీస్‌పై లోయర్ ఆర్డర్‌లో సెంచరీలతో చెలరేగిన సౌతాఫ్రికా బ్యాటర్లు!

యూరిన్ కిట్ల ద్వారా గంజాయి వ్యసనపరుల పట్టివేత..చందుర్తి సి ఐ రవీందర్

Select Suryaa Now
యూరిన్ కిట్ల ద్వారా గంజాయి వ్యసనపరుల పట్టివేత..చందుర్తి సి ఐ రవీందర్

సూర్య చందుర్తి రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి సర్కిల్ పరిధిలోని చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో గంజాయి రవాణా, విక్రయాలు  వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. రవీందర్ శనివారం చందుర్తి సర్కిల్ కార్యాలయం లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశం లో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం నిర్వహించిన తనిఖీలలో ముగ్గురు వ్యసనపరులను పట్టుకొని, వారిని న్యాయస్థానానికి తరలించడం జరుగుతోందని ఆయన వెల్లడించారు.
గంజాయి అక్రమ దందాకు స్వస్తి చెప్పేందుకు ఒకవైపు విస్తృత తనిఖీలు చేపడుతూనే, మరోవైపు గంజాయి వినియోగదారులను (వ్యసనపరులను) సాంకేతికంగా పట్టుకోవడానికి నూతనంగా అందుబాటులోకి వచ్చిన "యూరిన్ టెస్ట్ ఈ జెడ్ స్ప్లిట్ కీ డ్రగ్ స్క్రీన్ కిట్లను" సమర్థవంతంగా వినియోగిస్తున్నామని సీఐ పేర్కొన్నారు.దీనిలో భాగంగా,  సనుగుల గ్రామ శివారులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా సనుగుల గ్రామానికి చెందిన ఒక్క వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకోవడం అలాగే సనుగుల గ్రామ  జమ్మి గద్దె వద్ద కూడా పోలీస్ వారికి మరో  ఇద్దరు మరుపాక గ్రామానికి చెందిన వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని మొత్తం ముగ్గురి కి  "*యూరిన్ టెస్ట్  స్ప్లిట్ కీ డ్రగ్ స్క్రీన్ కిట్ల*" ద్వారా పరీక్ష చేయగా, వారి మూత్ర నమూనాలలో గంజాయిలోని ప్రధాన రసాయన పదార్థమైన ఆనవాళ్లు ఉన్నట్లు 'పాజిటివ్' అని తేలిందని దీని ద్వారా వారు గంజాయి సేవించినట్లు తక్షణమే ప్రాథమికంగా నిర్ధారించి, అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల నిమిత్తం కోర్టుకు తరలించడం జరుగుతోందని తెలిపారు ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన చందుర్తి ఎస్సై రమేష్‌ను  స్టేషన్ సిబ్బందిని సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రవీందర్ అభినందించారు.
గంజాయి బానిసలైన వారిని కేవలం శిక్షించడమే కాకుండా, వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే పోలీసు శాఖ ముఖ్య ఉద్దేశమని సీఐ తెలిపారు. ఈ పరీక్షల ద్వారా పట్టుబడిన వ్యసనపరులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చి, ప్రభుత్వ ఆధ్వర్యంలోని రిహాబిలిటేషన్ (పునరావాస) కేంద్రాలకు తరలించి వారిలో పరివర్తన తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.