రాప్తాడులో విద్యార్ధినిపై అమానుషదాడిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన ఉన్మాదిపై కఠిన చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశాలు
అమరావతి, మేజర్‌న్యూస్: అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ హై స్కూలులో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉన్మాది దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల తరగతి గదిలో రంపంతో అత్యంత అనుమానుషంగా దాడి చేయడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్ర గాయాల పాలైన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్స గురించి సిఎం అధికారులతో మాట్లాడారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని సీఎం పోలీసు అధికారులను ఆదేశించారు.