ఎస్ పెద్దవలస లో మూడు కుటుంబాలు వైసిపి లో చేరిక
మక్కువ, (మేజర్ న్యూస్):-
మండలంలో శీబిల్లిపెద్దవలసలో మూడు కుటుంబాలు తెలియజేసిన పార్టీ వైసీపీలో చేరినట్టు రాష్ట్ర వైసిపి కార్యదర్శి మావుడి శ్రీనివాసరావు తెలిపారు. పార్టీలో చేరిన వారికి కండువలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైసిపి ప్రచారంలో భాగంగా శనివారం శీబిల్లి పెద్ద వలస పరిసర గ్రామాల్లో వైసిపి ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.