పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ బహుకరణ
ఆత్మకూరు/ మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం తిప్పడం పల్లి గ్రామంలో శనివారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు గ్రామ సర్పంచ్ దిండి సుచిత్రమ్మ వాటర్ ప్యూరిఫైయర్ బహూకరించారు. విద్యార్థులకు నాణ్యమైన మంచినీరు అందించాలని ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం సుచిత్రమ్మన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.