సర్దార్ వళ్లబాయ్ పటేల్‌కు జయంతి సందర్బంగా ఘన నివాళి. :
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి. : నిర్మల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారతరత్న, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. దేశ సమైక్యత కోసం పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, అయ్యన్నగారి భూమయ్య, జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్‌తో పాటు పలువురు నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.