రేణిగుంటలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విస్తృత ప్రచారం
రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట పట్టణంలోని వినాయకనగర్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు.