తారకరామానగర్‌లో వైసీపీ ఎన్నికల ప్రచారలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.
రేణిగుంట మేజర్ న్యూస్: జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేణిగుంట మండలంలోని తారకరామానగర్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో కలిసి తూకివాకం మాజీ సర్పంచ్ సిద్ధప్ప రెడ్డి మునిశేఖర్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను కలిసి ఎన్నికల్లో విజయం చేకూర్చాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.