BREAKING
టిడిపి అఫ్రోజ్ కు జన్మదిన తెలిపిన డాక్టర్ ఫరీద్ బాబా రేణిగుంటలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విస్తృత ప్రచారం రాప్తాడులో విద్యార్ధినిపై అమానుషదాడిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన ఉన్మాదిపై కఠిన చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశాలు గ్లామర్ ప్రపంచంలో నితాన్షి గోయెల్ కొత్త ప్రయాణం 'షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా' జ్ఞాపకాలను పంచుకున్న తుషార్ కపూర్, సంజయ్ గుప్తా! కోతుల దాడులతో విసిగిపోయిన గ్రామస్తులు.. స్వచ్ఛందంగా నిధుల సేకరణ 'రామాయణం పార్ట్ 1' అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ కుందుర్పి లో ప్రచారం లో దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ. కుందుర్పి జోరుగా తెలుగుదేశం పార్టీ ప్రచారం. లాస్ ఏంజెల్స్‌లో యష్ పిల్లల 'రామయణం' సందడి! జడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థులు జోరుగా ప్రచారం.. కథ రాస్తేనే సినిమా కోణం మారుతుంది: నిరుప్ భండారీ ఇందిరా గాంధీ సేవలు, త్యాగాలు దేశ చరిత్రలో చిరస్మరణీయం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) మంగళకుంట గ్రామానికి థార్ రోడ్డు నిర్మాణం. ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సీఐ హరినాథ్.

ఆపదలో అండగా నిలిచిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. బాధితుడికి రూ.లక్ష LOC మంజూరు

Select Suryaa Now
ఆపదలో అండగా నిలిచిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. బాధితుడికి రూ.లక్ష LOC మంజూరు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్. వికారాబాద్ మండలం అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన సురేష్, సావిత్రి దంపతుల కుమారుడు శివనాగరాజు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న స్పీకర్ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.లక్ష విలువైన ఎల్‌ఓసీ మంజూరయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ శివనాగరాజు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, తన నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. అత్యవసర సమయంలో స్పందించి తమ కుమారుడి వైద్య చికిత్స కోసం రూ.లక్ష ఎల్‌ఓసీ మంజూరు చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సురేష్, సావిత్రి దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.