భక్తి భావంతో ఆంజనేయ స్వామి ఆలయానికి వెండి ఆభరణాల వితరణ....
సూర్య వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయానికి భక్తి భావంతో దాతలు వెండి ఆభరణాలను అందజేశారు. వేద పండితులు రవీందర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించాలని స్వామివారికి సమర్పించారు.గ్రామానికి చెందిన పత్తి నారాయణరెడ్డి, విమల, పత్తి భగవాన్ రెడ్డి, ఇంద్ర దంపతులు సుమారు రూ.1,70,000 విలువైన వెండి ఆభరణాలను స్వామివారికి సమర్పించారు.ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామివారిపై ఉన్న అపారమైన భక్తి, విశ్వాసంతో ఈ వెండి ఆభరణాలను సమర్పించినట్లు తెలిపారు. స్వామివారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. భగవంతుడి సేవలో భాగస్వాములు కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.హనుమంతుడు భక్తికి, ధైర్యానికి, సేవా భావానికి ప్రతీక అని, ఆయనను ఆరాధించడం ద్వారా ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సేవా గుణం పెంపొందుతాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జడల రమేష్, మాజీ సర్పంచ్ గంగాడి సౌజన్య, అధ్యక్షులు చింతల శ్రీనివాస్ రెడ్డి , ఉపాధ్యక్షులు, తోడేటి శ్రీనివాస్ గౌడ్, గౌరవ అధ్యక్షులు సింగిరెడ్డి మోహన్ రెడ్డి, గౌరవ సభ్యులు పత్తి దేవేందర్ రెడ్డి, గూటం సమ్మిరెడ్డి, పాలకవర్గ సభ్యులు గంగాడి మహేందర్ రెడ్డి, వంగ రమేష్ , గిరవేన రవీందర్, దాసరపు గురువయ్య, చంద్రమౌళి పోతరవీన, బూత్కూరు కుమార్, రాచర్ల శివకుమార్, కర్ర రవీందర్ రెడ్డి, కాసన గట్టు మహేందర్, రాకేష్, కొత్త దేవేందర్ రెడ్డి,
తదితరులు పాల్గొన్నారు. దాతలను అభినందించారు.