సంక్రాంతి బరిలోపా రంజిత్ 'వెట్టువమ్'
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'వెట్టువమ్'. ఆర్య, వి.ఆర్. దినేష్, శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ అధికారికంగా లాక్ అయింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి (జనవరి 2027) కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
వివిధ సమూహాల మధ్య అధికారం కోసం జరిగే పోరాటం ఆధారంగా మూడు కాలధర్మాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. కన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో అప్పట్లోనే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే సంక్రాంతి రేసులో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 'ధర్మన్',సివకార్తికేయాన్ 'సెయోన్' సినిమాలు నిలవగా, ఇప్పుడు ఆ జాబితాలోకి పా రంజిత్ 'వెట్టువమ్' కూడా వచ్చి చేరింది. దీంతో 2027 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద తమిళనాట భారీ పోరు జరిగే అవకాశం ఉంది.