BREAKING
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి సంబరాలు

Select Suryaa Now
అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి సంబరాలు

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సిఈఓ కావ్య మారన్ ల వివాహ వేడుకల సందడి మొదలైంది. పెళ్లి సంబరాల్లో భాగంగా ఇటీవల అనిరుధ్ నివాసంలో ఏర్పాటు చేసిన 'ధోల్' వేడుకలో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఎంతో ఉత్సాహంగా నృత్యం చేస్తూ అలరించారు.

దీనికి సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అభిమానులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం నవంబర్‌లో జరగబోయే వీరి వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.

సమాచారం ప్రకారం, వీరి వివాహం నవంబర్ 10, 11 తేదీలలో గ్రీస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 21న చెన్నైలోని ఒక ప్రముఖ స్టార్ హోటల్‌లో సినీ, వ్యాపార, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ నిర్వహించనున్నారు.

ప్రస్తుతం అనిరుధ్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ 'జెయిలర్ 2' చిత్రానికి సంగీతం అందిస్తూ పూర్తి బిజీగా ఉన్నారు. వ్యక్తిగత జీవితం, వృత్తిగత విజయాలు రెండింటితోనూ ఆయన ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు.