పదో తరగతి విద్యార్థిని గొంతు కోసిన వైనం.. మరో విద్యార్థినికి గాయాలు
పదో తరగతి విద్యార్థిని గొంతు కోసిన వైనం.. మరో విద్యార్థినికి గాయాలు
రాప్తాడు మేజర్ న్యూస్:
రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులపై ఓ దుండగుడు చెక్క మొద్దులు కోసే రంపపు మిషన్‌తో దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో పాఠశాల ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ ఘటనలో అయ్యవారిపల్లికి చెందిన గోపిక అనే విద్యార్థినికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. రాప్తాడుకు చెందిన లక్ష్మి అనే మరో విద్యార్థిని కూడా గాయపడినట్లు సమాచారం. దుండగుడు దాడికి పాల్పడటంతో విద్యార్థినులు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.
గాయపడిన విద్యార్థినులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
విద్యార్థినులపై దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు? దాడికి గల కారణాలేమిటి? పాఠశాల ప్రాంగణంలోకి దుండగుడు ఎలా ప్రవేశించాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.