ఇంద్రవెల్లి లో పాంచజన్య సంకల్ప సభ విజయవంతం.. ప్రజలకు సబితా మనోహర్ కృతజ్ఞతలు....
సూర్య బెజ్జుర్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: చలో ఇంద్రవెల్లి పిలుపుతో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ విజయవంతం కావడంతో సిర్పూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి కావేటి సబితా మనోహర్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బెజ్జూర్, చింతలమానేపల్లి, కౌటాల, పెంచికల్‌పేట్, దహెగాం, సిర్పూర్, కాగజ్‌నగర్ మండలాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.