ఘోర రోడ్డు ప్రమాదం యువకుడి దుర్మరణం
సూర్య వేల్పూర్ “”63వ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ రోడ్డు ప్రమాదంలో అంక్సాపూర్ గ్రామానికి చెందిన పాషపు సన్నీ అనే యువకుడు మరణించారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం అంక్సాపూర్ నుండి ఆర్మూర్ వైపు తన కారులో పాషపు సన్నీ వెళుతుండగా ఆర్మూర్ నుండి మద్యం సరఫరా చేసే వ్యాన్ మెట్పల్లి వైపు వెళ్తూ కారు ను ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న సన్నీ తీవ్ర గాయాలు కావడంతో రక్తపు మడుగులో కొనఊపిరితో ఉండగ ప్రయాణికులు స్థానికులు స్పందించి కారులో నుండి యువకుడిని బయటకు తీసి 108 లో ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలికి పోలీసులు చేరుకొని యువకుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. తీవ్ర గాయాల పాలైన పాషపు సన్నీ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యుల రోదన ఎవరు ఆపలేకపోయారు. అదే రోజున ఉదయం అయ్యప్ప మాల తీసుకున్న సన్నీ దైవ సన్నిధికి చేరుకోవడం హృదయ విదారకరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఆయన మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణమైన వ్యానులు పోలీసుల అదుపులో కి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.