BREAKING
జడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థులు జోరుగా ప్రచారం.. కథ రాస్తేనే సినిమా కోణం మారుతుంది: నిరుప్ భండారీ ఇందిరా గాంధీ సేవలు, త్యాగాలు దేశ చరిత్రలో చిరస్మరణీయం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) మంగళకుంట గ్రామానికి థార్ రోడ్డు నిర్మాణం. ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సీఐ హరినాథ్. ఈరోజు (31 అక్టోబర్ 2026, శనివారం) 12 రాశుల వారికి జ్యోతిష్య నిపుణుల సూచనల ప్రకారం కెరీర్, ఆర్థికం, కుటుంబ పరంగా ఫలితాలు చూద్దాం: పదో తరగతి విద్యార్థిని గొంతు కోసిన వైనం.. మరో విద్యార్థినికి గాయాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎస్‌బీఐ రూ.5 కోట్ల విరాళం సంక్రాంతి బరిలోపా రంజిత్ 'వెట్టువమ్' ఆపదలో అండగా నిలిచిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. బాధితుడికి రూ.లక్ష LOC మంజూరు సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ హిస్టరీ: 'జెయిలర్ 2' రికార్డు! బంగారు రుణాలపై వడ్డీ భారం తగ్గించుకోండి.. కట్టంగూర్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభం కొత్తూరు వన్ లో జోరందుకొన్న జనసేన. బద్వేల్ లో స్టేట్ బ్యాంకు వద్దచోరీ కలకలం. అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి సంబరాలు

లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగిస్తే కఠిన చర్యలు పలమనేరు పట్టణంలో 350 మంది పోలీసు, పారా మిలటరీ బలగాలతో భారీ కవాతు

Select Suryaa Now
లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగిస్తే కఠిన చర్యలు పలమనేరు పట్టణంలో 350 మంది పోలీసు, పారా మిలటరీ బలగాలతో భారీ కవాతు

పలమనేరు మేజర్ న్యూస్ సుమారు 350 మంది పోలీసు, బెటాలియన్, పారా మిలటరీ సిబ్బంది పాల్గొన్న ఈ కవాతు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు.రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించినా, ప్రజాశాంతికి భంగం కలిగించినా చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ఈ కవాతులో పలమనేరు అర్బన్ సీఐ మోహన్ రెడ్డి, గంగవరం సీఐ రామ్ గోపాల్, పలమనేరు రూరల్ సీఐ పరుశురామ్, వి.కోట సీఐ సోమశేఖర్ రెడ్డి, ఎస్సైలు స్వర్ణ తేజ, చందన ప్రియతో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్