BREAKING
గ్లామర్ ప్రపంచంలో నితాన్షి గోయెల్ కొత్త ప్రయాణం 'షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా' జ్ఞాపకాలను పంచుకున్న తుషార్ కపూర్, సంజయ్ గుప్తా! కోతుల దాడులతో విసిగిపోయిన గ్రామస్తులు.. స్వచ్ఛందంగా నిధుల సేకరణ 'రామాయణం పార్ట్ 1' అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ కుందుర్పి లో ప్రచారం లో దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ. కుందుర్పి జోరుగా తెలుగుదేశం పార్టీ ప్రచారం. లాస్ ఏంజెల్స్‌లో యష్ పిల్లల 'రామయణం' సందడి! జడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థులు జోరుగా ప్రచారం.. కథ రాస్తేనే సినిమా కోణం మారుతుంది: నిరుప్ భండారీ ఇందిరా గాంధీ సేవలు, త్యాగాలు దేశ చరిత్రలో చిరస్మరణీయం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) మంగళకుంట గ్రామానికి థార్ రోడ్డు నిర్మాణం. ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సీఐ హరినాథ్. ఈరోజు (31 అక్టోబర్ 2026, శనివారం) 12 రాశుల వారికి జ్యోతిష్య నిపుణుల సూచనల ప్రకారం కెరీర్, ఆర్థికం, కుటుంబ పరంగా ఫలితాలు చూద్దాం: పదో తరగతి విద్యార్థిని గొంతు కోసిన వైనం.. మరో విద్యార్థినికి గాయాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎస్‌బీఐ రూ.5 కోట్ల విరాళం

యలహంక ఆస్తి వివాదంపై షర్మిల సంచలన పోస్ట్: కూతురి పెళ్లి వేదిక మార్పు!

Select Suryaa Now
యలహంక ఆస్తి వివాదంపై షర్మిల సంచలన పోస్ట్: కూతురి పెళ్లి వేదిక మార్పు!

సూర్య పొలిటికల్ డెస్క్: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ వేదిక మార్పుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. యలహంక ఆస్తి వివాదం, కూతురి పెళ్లి వేదిక విషయమై ఆమె ఎక్స్ (ట్విట్టర్) ద్వారా సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేశారు.

షర్మిల తన పోస్ట్‌లో పేర్కొన్న పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:

  • ఆస్తిపై స్పష్టత: తనది కాని దానికోసం ఆశపడే నీచత్వం తనది కాదని షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ ఆస్తుల పంపకాల్లో భాగంగా పూర్తిగా 100 శాతం తనకి, తన పిల్లల భాగానికి వచ్చిందని, ఇది దేవుడి సాక్షిగా నిజమని ఆమె పేర్కొన్నారు.

  • కూతురి ఆకాంక్ష నెరవేరలేదంటూ ఆవేదన: దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తిరిగిన ఇల్లు కావడంతో పాటు, తన కుమార్తె అంజిలి కోరిక మేరకు ఆమె వివాహాన్ని ఆ ఇంట్లోనే జరపాలనుకున్నామని షర్మిల తెలిపారు. సొంతఇంట్లో బిడ్డ పెళ్లి చేయాలని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారని, కానీ తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న తన బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని ఆమె చాలా బాధపడ్డారు.

  • వివాహ వేదిక మార్పు: వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, తమ బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పెద్దలు కుదిర్చిన వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల వివాహాన్ని ఎలాంటి వివాదాలు లేకుండా, గొడవలు లేకుండ ప్రశాంతంగా జరిపించాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు.

  • వేరే ప్రదేశంలో వివాహం: అందుకే యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో ఈ పరిణయ వేడుకను నిర్వహించాలని నిశ్చయించుకున్నట్లు షర్మిల వెల్లడించారు. కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని ఆమె మనసారా ఆకాంక్షించా