BREAKING
సంక్రాంతి బరిలోపా రంజిత్ 'వెట్టువమ్' ఆపదలో అండగా నిలిచిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. బాధితుడికి రూ.లక్ష LOC మంజూరు సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ హిస్టరీ: 'జెయిలర్ 2' రికార్డు! బంగారు రుణాలపై వడ్డీ భారం తగ్గించుకోండి.. కట్టంగూర్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభం కొత్తూరు వన్ లో జోరందుకొన్న జనసేన. బద్వేల్ లో స్టేట్ బ్యాంకు వద్దచోరీ కలకలం. అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి సంబరాలు రాప్తాడు ఉన్నత పాఠశాలలో కలకలం పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి.. గొంతు కోసిన దుండగుడు జీవా 'తగప్పన్' సినిమా నుండి 'తంగపుళ్ళ' ఫస్ట్ సింగిల్ విడుదల! మోహన్‌లాల్ 'అతిమనోహరం' సినిమాపై ప్రొడ్యూసర్ క్లారిటీ! యలహంక ఆస్తి వివాదంపై షర్మిల సంచలన పోస్ట్: కూతురి పెళ్లి వేదిక మార్పు! జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా వికారాబాద్‌లో ఘనంగా 2కే రన్.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా ఘోర రోడ్డు ప్రమాదం యువకుడి దుర్మరణం సూర్య న్యూస్‌కు స్పందన.. పైపులైన్ లీకేజీకి మరమ్మతులు!.... ఇంద్రవెల్లి లో పాంచజన్య సంకల్ప సభ విజయవంతం.. ప్రజలకు సబితా మనోహర్ కృతజ్ఞతలు....

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు 

Select Suryaa Now
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు 

కృష్ణ సూర్య న్యూస్ :

భారత జాతి ఐక్యతకు ప్రతీక, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను మండలంలోని ముడుమాల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.

కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు సర్దార్ వల్లభాయ్  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దండు శేఖర్ మాట్లాడుతూ..  భారత రత్న, దేశ తొలి ఉప ప్రధాని అయిన సర్దార్  దేశ సమైక్యతకు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి

అని కొనియాడారు. దేశ విలీనంలో ఆయన చూపిన చొరవను గుర్తుచేస్తూ,  త్యాగాలను, సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. విద్యార్థులంతా చిన్నతనం నుండే దేశ సమైక్యతా భావాలను అలవర్చుకువాలని పిలుపునిచ్చారు.

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని,

బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని,

ఆకాంక్షించారు.

ప్రతి ఒక్క విద్యార్థి దేశ సేవకు  పాటుపడాలని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భారతి, రవికుమార్, పద్మావతమ్మ, మహేశ్వరి, రేణుక, పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు , విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

నర్సిములు , సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం