ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో శనివారం మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె చేసిన సేవలను కొనియాడారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నాగమణి రాజేష్, వైస్ చైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండి రహమతుల్లా, మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు, జిల్లా నాయకులు తులసిరాజు, పరమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ గౌడ్, మహేష్, వినయ్ కుమార్ రెడ్డి, కరణ్ లాల్, బుచ్చన్న, గడ్డం శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.