BREAKING
పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ

కొత్తగూడెం విమానాశ్రయానికి మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు పెట్టాలి – ఏవైఎస్ డిమాండ్

Select Suryaa Now
కొత్తగూడెం విమానాశ్రయానికి మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు పెట్టాలి – ఏవైఎస్ డిమాండ్

 

సూర్య వేల్పూరు ;;వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం (ఏవైఎస్) ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా జ్యోతిబా ఫూలే 136వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏవైఎస్ నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో విద్యా వెలుగులు నింపి, అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే అని కొనియాడారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం, కులవివక్ష నిర్మూలన కోసం ఆయన చేసిన కృషి, త్యాగాలు, పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని చాటిచెప్పిన మహనీయుడు జ్యోతిబా ఫూలే అని అన్నారు.అలాగే కొత్తగూడెంలో నిర్మిస్తున్న విమానాశ్రయానికి జాతిపిత మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడికి ఇదే నిజమైన గౌరవమని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తమ డిమాండ్‌ను పరిశీలించి విమానాశ్రయానికి మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు నామకరణం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏవైఎస్ ప్రధాన కార్యదర్శి జాంబవ చమార్, ఉపాధ్యక్షులు కే. రంజిత్, సలహాదారులు సురేందర్, పరమేష్, కార్యదర్శి శ్రీనివాస్, మాదిగ సంఘం మాజీ అధ్యక్షులు టి. శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.