BREAKING
ప్రమాణ స్వీకారం చేసిన జెడ్పిటిసి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇటలీని కుదిపేసిన కార్మికుల సమ్మె కె. పెదపూడిలో వేడెక్కిన పంచాయతీ సమరం.. రాయపురెడ్డి సత్యనారాయణ వైపే మెజారిటీ వర్గాల మొగ్గు! బెజ్జుర్ లో ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం అప్లికేషన్ స్వీకరణ వాసిలి సర్పంచ్ పదవికి సుంకర చౌదరి నామినేషన్ మంత్రి "ఆనం "ఆశీస్సులు తీసుకున్న జెడ్పిటిసి సభ్యులు COP31 సదస్సులో టర్కీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లటూరు లో సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ లు నెల్లూరులో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ  మెరుపు దాడులు -  నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కలకలం  - బందోబస్తు మధ్య కొనసాగిన తనిఖీలు. గుంటూరు మండల అధ్యక్షులుగా సీతామహాలక్ష్మి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలనీ ఊరితాళ్ళతో నిరసన : ఏఐఎస్ఎఫ్ ప్రముఖ హోటల్ సంస్థ Accorలో నాయకత్వ మార్పు డిమాండ్ అర్హులైన కుటుంబాలు బీమా నమోదును సద్వినియోగం చేసుకోవాలి తిరుపతి జిల్లా మొట్టమొదటి జెడ్పి చైర్ పర్సన్ గా హెచ్. హేమలత, ప్రమాణ స్వీకారం

ఖాదరగూడెంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

Select Suryaa Now
ఖాదరగూడెంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
సూర్య మానకొండూరు : మానకొండూరు మండలం ఖాదరగూడెం గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో సంపూర్ణ ఆర్థిక సేవల కార్యక్రమం, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ ముదిగంటి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీమా, సామాజిక భద్రతా పథకాలను అందించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY) పథకాలపై వివరించి, అర్హులను నమోదు చేశారు. బ్యాంకు ఖాతాల కేవైసీ, నిరుపయోగంగా ఉన్న ఖాతాల పునరుద్ధరణ, పెన్షన్ పథకాలపై అవగాహన కల్పించారు. ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ కాయితం క్రాంతి సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అక్షయ, ఉప సర్పంచ్ శ్రీలత, బ్యాంకు సిబ్బంది క్రాంతి, కౌన్సిలర్ తొర్తి శ్రీనివాస్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.