BREAKING
ఈ నెల 20, 21 తేదీల్లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల మేళా ఎన్నికల విధులు నిర్వహించిన వార్డు సచివాలయ ఉద్యోగులకు గౌరవ వేతనం చెల్లించాలి.. కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన అనంతపురం జిల్లా స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు.. మరోసారి అలరించనున్న ప్రేమలు జోడీ.. ‘హలో డియర్’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన మేకర్స్ రొమాన్స్, కామెడీ మరియు థ్రిల్లర్ అంశాల కలయికతో ‘క్రిమ్సన్ పియర్’ చిత్రం ప్రారంభం.. సెట్స్ పైకి వెళ్లిన కొత్త సినిమా బాలీవుడ్‌లో సంచలన చిత్రం వాయిదా.. సన్నీ డియోల్ ‘సూర్య’ విడుదల ఎందుకు నిలిచిపోయింది? పారిశుద్ధ్య పనుల తీరును పరిశీలించిన ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజా రవీంద్రనాథ్ చౌదరి.. అరవింద్ నగర్, ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల సమీపంతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటన.. పారిశుద్ధ్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్న అధికారి.. ఒక్కో కోవిడ్ బెడ్‌కు రూ.లక్ష లంచం వసూలు ఐపీఎల్ 2027 వేలానికి కేకేఆర్ వ్యూహం.. భారీ ధర పెట్టిన స్టార్ ఆటగాళ్లను వదిలేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం-సుమారు 12 లక్షల ఆస్తి నష్టం కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది ఐపీఎల్ వీడ్కోలు పోస్ట్‌లో అమితాబ్ బచ్చన్ క్లాసిక్ సాంగ్.. మహేంద్ర సింగ్ ధోనీ ఆ పాట ఎంచుకోవడానికి అసలు కారణం ఇదే! జెడ్పీ కార్యాలయంలోని అన్ని విభాగాల పనితీరుపై అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్ ఐఏఎస్ క్షేత్రస్థాయి పరిశీలన.. సీఈఓ ఆహ్వానం మేరకు కార్యాలయాన్ని సందర్శించి, వివిధ సెక్షన్ల కార్యకలాపాలు, రికార్డుల నిర్వహణపై సమీక్ష వైసీపీ, టీడీపీ పరస్పర రాళ్ల దాడులు తుఫాన్ హెచ్చరిక టెస్టు క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన 20 ఏళ్ల ఆఫ్ఘన్ ఆల్ రౌండర్.. జింబాబ్వేపై నసీర్ ఖాన్ వీరోచిత పోరాటం

కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది

Select Suryaa Now
 కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది
హైదరాబాద్, నవంబర్ 18: నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో సమైక్య రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించుకుపోయారని, ఇప్పుడు ఏకంగా నాగార్జునసాగర్ నుంచే నీళ్లను తీసుకెళ్తున్నారని ఆరోపించారు. తాగునీటి అవసరాల పేరు చెబుతూ ఏకంగా 90 టీఎంసీల నీళ్లను తరలించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సాగర్‌లో కనీస నీటిమట్టమైన 510 అడుగుల కంటే దిగువకు వెళ్లి పొక్కపెట్టి నీళ్లు తీసుకెళ్తున్నా, ఆ జిల్లాకు చెందిన మంత్రికి ఏమాత్రం పట్టింపు లేదని ఆయన మండిపడ్డారు. అటు శ్రీశైలం ప్రాజెక్టులో కూడా యథేచ్ఛగా జలదోపిడీ జరుగుతోందని అన్నారు. ఒకే ప్రాజెక్టు కింద ఉన్న సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు క్రాప్ హాలీడే లేదని, కానీ తెలంగాణ పరిధిలోని ఎడమ కాలువ కింద మాత్రం క్రాప్ హాలీడే ప్రకటించారని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకే ప్రాజెక్టు కింద ఇలాంటి వివక్షాపూరిత పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.