గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం-సుమారు 12 లక్షల ఆస్తి నష్టం
మంగపేట, మేజర్ న్యూస్, మండలంలోని రమణక్కపేట గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు మరియు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఇందారపు రూవిత్ కుమార్ ఇంట్లో గ్యాస్ లీక్ అయి సుమారు 10 గంటల ప్రాంతంలో సిలిండర్ పేలడంతో ఇంట్లో ఉన్న నిత్యవసర వస్తువులు ఐదు లక్షల డబ్బు, ఐదు తులాల బంగారం తో పాటు ఇల్లు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. దీనితో సుమారు 12లక్షల ఆస్తి నష్టం సంభవించిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు స్పందించి ఇందిరమ్మ ఇల్లు మరియు నష్టపరిహారం అందించాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులు వేడుకుంటున్నారు.
రిపోర్టర్; స్నేహ కుమార్, మంగపేట, ములుగు జిల్లా