జెడ్పీ కార్యాలయంలోని అన్ని విభాగాల పనితీరుపై అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్ ఐఏఎస్ క్షేత్రస్థాయి పరిశీలన.. సీఈఓ ఆహ్వానం మేరకు కార్యాలయాన్ని సందర్శించి, వివిధ సెక్షన్ల కార్యకలాపాలు, రికార్డుల నిర్వహణపై సమీక్ష
(అనంతపురం కార్పొరేషన్ మేజర్ న్యూస్..)
అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలోని వివిధ విభాగాల కార్యకలాపాలు, పరిపాలనా విధానాలు, ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్ ఐఏఎస్ క్షేత్రస్థాయి సందర్శన నిర్వహించారు.జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ ఆహ్వానం మేరకు కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, జెడ్పీ కార్యాలయంలోని అన్ని సెక్షన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో నిర్వహిస్తున్న విధులు, రికార్డుల నిర్వహణ, పరిపాలనా కార్యకలాపాలు, వివిధ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.ప్రతి విభాగం పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తూ, కార్యాలయ పరిపాలన మరింత సమర్థవంతంగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వ విధులు, ప్రజలకు సంబంధించిన సేవలను బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ, సంబంధిత అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.